: 89కు చేరిన చైనా భూకంప మృతులు

చైనా భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప మృతుల సంఖ్య నేటికి 89కి చేరింది. నిన్న చైనా ఆగ్నేయ ప్రాంతంలోని గన్సు రాష్ట్రంలో మింగ్ జియాన్, ఝాంగ్ జియాన్ గ్రామాల్లో రెండుసార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. కాగా, దాదాపు ఐదువందల మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే భారీవర్షాల కారణంగా వరదలతో అతలాకుతమైన చైనాను భూకంపం మరింత ఇబ్బంది పెడుతోంది.

More Telugu News