: హర్యానా మాజీ సీఎం బెయిల్ పొడిగింపు
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మధ్యంతర బెయిల్ గడువును ఆగస్టు 12 వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ గడువును పొడిగించాలని చౌతాలా కోర్టును అభ్యర్ధిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్ధనను మన్నించిన న్యాయస్థానం బెయిల్ గడువును పొడిగించింది. ఉపాధ్యాయుల నియామకం కుంభకోణంలో చౌతాలా అరెస్టయిన సంగతి తెలిసిందే.