: కూలిన గోడ.. ఐదుగురు దుర్మరణం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మౌలాలీలోని ఎంజే కాలనీలో పురాతన గోడ ఒకటి కూలి పక్కనే ఉన్న గుడిసెలపై పడిపోయింది. గుడిసెల్లో నిద్రిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వీరంతా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి పొట్ట కూటి కోసం నగరానికి వచ్చిన రోజు కూలీలు. మృతులను పద్మ, మహదేవ్, అనిల్, శివ, వెంకటయ్యగా గుర్తించారు. శిథిలాల కింద ఉన్న ముగ్గురిని రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి తక్షణం మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.

More Telugu News