: భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ భారత్ చేరుకున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. బిడెన్ తన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక అంశాలపై భారత్ తో చర్చించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ లను రేపు కలవనున్నారు. అంతేగాకుండా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ తోనూ బిడెన్ భేటీ అవుతారు. ఇక ఈనెల 24, 25 తేదీల్లో ఆయన ముంబయిలో భారత వాణిజ్యవేత్తలతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. కాగా, బిడెన్ కు భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. తొలిసారిగా 2008లో సెనేటర్ హోదాలో ఆయన ఇక్కడికి వచ్చారు.