: శాసనసభకు కంప్యూటర్ కళ
రాష్ట్ర శాసనసభను పూర్తిగా కంప్యూటరైజ్ చేయనున్నారు. అసెంబ్లీ కంప్యూటరీకరణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిందని శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్ లో తెలిపారు. ఇందుకు సంబంధించి 16 కోట్ల రూపాయల నిధులు కూడా కేంద్రం మంజూరు చేసిందన్నారు. శాసనసభ కంప్యూటరీకరణ మిషన్ మోడ్ ప్రాజెక్టుగా కేంద్రం మన రాష్ట్ర శాసనసభను ఎంపిక చేసిందని, ఈ తరహా ప్రాజెక్టు దేశంలో ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఇక నుంచి శాసనసభ వ్యవహారాలన్నీ పూర్తిగా కంప్యూటర్ సాయంతోనే జరుగుతాయి. తెలుగులోనూ శాసనసభ వెబ్ సైట్ అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును మరో 18 నెలల్లోనే పూర్తి చేయాలని కేంద్రం కోరినట్టు సభాపతి తెలిపారు.