: చైనాలో భూకంపం.. 47 మంది మృతి

చైనాలో భూకంపం సంభవించింది. జింజియాన్, మిన్సియన్ రాష్ట్రాల్లో వచ్చిన భూకంపం ధాటికి 47 మంది మరణించారు. దాదాపు 300 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఒక నిమిషం పాటు భూకంపం ప్రజలను వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. అటు, భవనాలు బీటలు వారాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇప్పటికే అతలాకుతలం అయిన చైనాకు, తాజా భూకంపంతో మరో దెబ్బ తగిలినట్టయింది.

More Telugu News