: ఇప్పటికే రాష్ట్రంలో అధిక వర్షపాతం
రాష్ట్రంలో ఇప్పటివరకు కురిసిన వర్షాలతో సాధారణ సగటు వర్షపాతం కంటే 28 శాతం ఎక్కవగా నమోదైనట్లు విపత్తు నిర్వహణ కమీషనర్ రాధ తెలిపారు. ఇవాల్టి వరకు కురవాల్సిన సాధారణ సగటు వర్షపాతం 229.4 మిల్లీమీటర్లు కాగా, 296.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ లో సాధారణం కంటే అత్యధికంగా 82 శాతం వర్షపాతం నమోదవడం విశేషం.