: పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు.. ఇక్కడ పని చేయడం కష్టం: ఎస్పీ

అనంతపురం జిల్లాలో పని చేయడం కష్టమని సాక్షాత్తూ ఆ జిల్లా ఎస్పీ అన్నారంటే అక్కడ పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చు. అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో ఎస్పీ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, జిల్లాలో నిష్పక్షపాతంగా పని చేయడం కష్టంగా మారిందన్నారు. ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయని కుండబద్దలుకొట్టారు. అయినప్పటికీ ఎన్నికల్లో నిక్కచ్చిగా వ్యవహరించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని ఎస్పీ తెలిపారు. సాక్షాత్తు ఎస్పీయే సదరు వ్యాఖ్యలు చేశారంటే సిబ్బంది విధులు ఏ పరిస్ధితుల్లో నిర్వహించనున్నారో మీరే అర్ధం చేసుకోండి!

More Telugu News