: పాము పొట్టలో ఎన్ని పిల్లలో!
ఒక పాము పొట్టలో ఎన్ని పిల్లలు ఉంటాయి. మహా అయితే ఓ పదీ.. ఇరవై. కానీ వందలాది పిల్లలుంటే అది వండరే కదా? గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో 8 అడుగుల పొడవున్న పాము ఒక ఇంట్లోకి వెళుతూ అక్కడున్న వారి కంటపడింది. వెంటనే వారు అప్రమత్తమై దానిని చంపగా పొట్టలో నుంచి 150 కి పైగా పిల్లలు బయటకు వచ్చాయి. గుడ్లు పెట్టి వాటిని పొదిగే పాములు ఉన్నట్లే, నేరుగా పిల్లలను కనే పాములు కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఇది ఆ రెండో రకానికి చెందినది. అయితే, ఒకేసారి అన్నేసి పిల్లలు బయటకు రావడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేయడంతోపాటు భయానికి గురి చేసింది. ఈ ఘటన గ్రామంలోని చెన్నకేశవనగర్ లో శనివారం రాత్రి జరిగింది .