: కలిసి వుండడం సాధ్యంకాక... విడిగా ఉండలేక... కలిసి వెళ్లిపోయిన ప్రేమ జంట
ఖమ్మం జిల్లాలో ఓ ప్రేమ జంట ఒకర్ని విడిచి ఒకరు ఉండలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. దమ్ముపేట మండలం చిల్లగుంపు గ్రామానికి చెందిన మధు(24) వీరనాగు(18) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వీరనాగుకు వేరే వ్యక్తిని చూసి పెళ్లి చేశారు. అయినప్పటికీ వీరి ప్రేమ కొనసాగుతోంది. ఇక విడివిడిగా ఉండలేమని, అలాగని కలిసి ఉండడం కూడా కుదరదని భావించిన ఆ ప్రేమ జంట, గత రాత్రి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి పురుగుల మందుతాగి చనిపోయారు. ఈ ఉదయం బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులు విషయం గమనించి పోలీసులకు సమాచారమందించారు.