: సినీ ఫక్కీలో ఏఎస్సై దుర్మరణం

వాహనాలు తనిఖీ చేస్తున్న ఓ ఏఎస్సై సినీ ఫక్కీలో దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరు వద్ద వాహనాల తనిఖీ కోసం పోలీసులు ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ ఉదయం అక్కడ వాహనాల తనిఖీలో ఏఎస్సై ప్రసాద్ పాల్గొన్నాడు. పండ్ల లోడుతో వచ్చిన ఓ వ్యాన్ ను ఆపమని సూచించాడు. కానీ, ఆ వ్యాన్ డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళేందుకు యత్నించాడు. ఏఎస్పై ఆ వాహనాన్ని అడ్డగించేందుకు సిద్ధపడుతుండగా.. వ్యాన్ డ్రైవర్ వేగంగా నడిపి ఏఎస్సైను ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో ప్రసాద్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచాడు. ఏఎస్సై కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ ప్రభాకరరావు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

More Telugu News