: విజయమ్మను ఏమనాలి?: మంత్రి పితాని
ఫీజు పోరు పేరిట దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఏమనాలని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. నేడు హైదరాబాదులో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్ మెంటుకు సంబంధించి గతేడాది ఒక్క రూపాయి కూడా బకాయి లేదని, అయినా దీక్ష చేపడుతున్న ఆమెను ఏమనాలని ప్రశ్నించారు. ఏడాదికోరోజు జాతరలా విజయమ్మ ఫీజు పోరు దీక్ష చేపడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో తమ ఉనికి చాటుకునేందుకు విజయమ్మ దీక్ష చేపడుతున్నారని ఆయన విమర్శిచారు. నూతన ఫీజు రీయింబర్స్ మెంటు పాలసీని మూడు రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.