: ఐరన్ మాత్రలతో 200 మంది విద్యార్థులకు అస్వస్థత

మధ్యాహ్న భోజనం విషాహారంగా మారి, బీహార్లో 27 మందిని బలితీసుకున్న ఘటన మరువక ముందే ఢిల్లీలో 200 మంది విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. రక్తహీనత సమస్య అరికట్టేందుకు ఢిలీల్లోని పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేశారు. వీటిని వేసుకున్న అనంతరం వారికి కడుపులో నొప్పి, వాంతులు మొదలయ్యాయి. నగర వ్యాప్తంగా మొత్తం 200 మంది విద్యార్థులు అస్వస్థతతో ఆసుపత్రులలో చేరారని సమాచారం. నగరవ్యాప్తంగా 18 లక్షల మాత్రలను పంపిణీ చేశారు. అయితే, 1 శాతం కేసులలో ఇలాంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయని వైద్యశాఖాధికారులు తెలిపారు.

More Telugu News