: ప్రళయ గోదావరి.. ముంపు ముంగిట భద్రాచలం

భారీ వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాణహిత, శబరి తదితర ఉపనదులు, ఏర్లు, వాగుల నుంచి వరదనీరు వస్తుండడంతో ఈ ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయి (49 అడుగుల ఎత్తు)లో ప్రవహిస్తోంది. దీంతో, రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే భద్రాద్రి రామాలయం అన్నదాన సత్రం వరకూ వరదనీరు ముందుకొచ్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే వెంకటాపురం పునరావాస కేంద్రానికి 100 మందిని తరలించారు. డివిజన్ లోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మార్గంలో కొండాపూర్ వంతెన, పాత్రాపురం వద్ద రహదారులపైకి వరదనీరు రావడంతో రాకపోకలు ఆగిపోయాయి. వరద ఇంకా పెరిగితే భారీగా పంట నష్టం తలెత్తుతుందని భావిస్తున్నారు.

More Telugu News