: కల్యాణ్ రామ్ జీవితానికి మేలి మలుపు ఈ సినిమా: చంద్రబాబు నాయుడు
నటుడు కల్యాణ్ రామ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు అభినందించారు. కల్యాణ్ రామ్ నటించి, నిర్మించిన త్రీడీ సినిమా 'ఓం' ను చంద్రబాబు నాయుడు నేడు వీక్షించారు. అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ సినిమా ప్రాంతీయభాషల చిత్రసీమలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సినిమాను అంతర్జాతీయ నిపుణులు ఎంతో శ్రమించి సాంకేతిక అద్భుతంగా మలిచారన్నారు. కల్యాణ్ రామ్ సినీ జీవితానికి, తెలుగు సినిమా చరిత్రకు ఈ సినిమా మేలి మలుపు అవుతుందని అన్నారు. తెలుగు సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించేందుకు ఈ సినిమా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు అశీర్వదించి అభినందించాలన్నారు.