: తమసోమా జ్యోతిర్గమయా...!

అంటార్కిటికా వంటి మంచు ప్రాంతాల్లో ఆరు నెలల కాలం పాటు చీకటి, ఆరు నెలల కాలం పాటు పగలు ఉంటాయని మనం చదువుకున్నాం. అయితే నార్వేలోని ఒక నగరంలో మాత్రం ఇప్పటికీ సూర్యకాంతి ప్రసరించదు. శీతాకాలంలో మాత్రం ఆ నగరంలో చీకటి రాజ్యమేలుతుంది. ఈ నగరం ఏర్పాటైనప్పటి నుండీ అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

నార్వేలోని జుకాన్‌ అనే ఒక పారిశ్రామిక నగరం ఒక లోయలో ఉంది. దీంతో ఆ లోయలోకి శీతాకాలంలో సూర్యుడి వెలుగు ప్రసరించదు. దీంతో 1907లో అక్కడ ఉండేవారికి ఒక ఆలోచన వచ్చింది. ఒక భారీ అద్దాన్ని ఆ నగరంలో ఏర్పాటు చేయడంద్వారా సూర్యకాంతిని ప్రసరింపజేయవచ్చని ఆలోచించిన ఆ నగర ప్రజలు అద్దం ఏర్పాటు చేసే ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటి పరిస్థితులు అనుకూలించని కారణంగా అద్దం ఏర్పాటు జరగలేదు.

ఇటీవలే మళ్లీ ఈ అద్దం నిర్మాణం చేసే ప్రాజెక్టును చేపట్టారు. ఈనెల ఒకటిన మొదలైన ఈ ప్రాజెక్టు దాదాపుగా పూర్తయింది. భారీ అద్దాల ఏర్పాటు ప్రాజెక్టు అంతా పూర్తయితే సెప్టెంబరునుండి ఇక్కడి వారికి శీతాకాలంలో సూర్యుడి వెలుతురు అందుతుంది. అయితే నగరం మొత్తం వ్యాపించదు. కేవలం నగరంలోని ఒక ప్రాంతంలోనే వెలుగు ప్రసరిస్తుంది. ఈ అద్దాల ప్రాజెక్టు ఏర్పాటుకు అయిన ఖర్చు రూ.5 కోట్లు. మరి నగరంలో కొంత మేరకైనా చీకటిని తరమేశారు కదా!

More Telugu News