: ఇంటర్నెట్ సెంటర్లపై పోలీసు దాడులు
హైదరాబాదులో పండుగ సీజన్ ప్రారంభమైంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. పండుగల సందర్భంగా ప్రార్ధనలు, పూజలకు భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడే అవకాశముండడంతో ఉగ్రవాదులు విరుచుకుపడొచ్చని ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమయిన పోలీసులు ఇంటర్నెట్ సెంటర్లపై దాడులు చేశారు.
ఈ ఏడాది రంజాన్, బోనాల సీజన్ ఒకేసారి రావడంతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశముందని నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారముంది. దీంతో ఉగ్రవాదులు సమాచార మార్పిడికి ఇంటర్నెట్ ను ఆశ్రయించే అవకాశముంది. దీంతో ఇప్పటికే పోలీసులు ఇంటర్నెట్ కేఫ్ లకు సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతే కాకుండా వినియోగదారుల ఫోన్ నెంబర్, వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని కూడా ఆదేశించారు. తాజా దాడుల్లో గతంలో తమ ఆదేశాలు పాటించని కేఫ్ లను సీజ్ చేశారు.