: ఐపీఎల్ ఫిక్సింగ్ వెనుక దావూద్ ఇబ్రహీం!
ఐపీఎల్ ఆరవ సీజన్ లో సంచలనం సృష్టించిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ వ్యవహారం వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఓ మంత్రి పాత్ర కూడా ఈ ఫిక్సింగ్ లో ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు ముగ్గురు అరెస్టు కాగా,, సహ యజమానులు కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ మొత్తం వ్యవహారం వెనుక దావూద్ ప్రమేయం ఉందని మొదటినుంచి అనుమానాలు వెల్లువెత్తాయి. అది నిజమేనని పోలీసులకు లభించిన ఫోన్ సంభాషణలు వెల్లడిస్తున్నాయి దుబాయ్ లో ఉన్న దావూద్,ఇండియాలో ఉన్న క్రికెట్ బుకీ జావెద్ చోటానీతో మాట్లాడాడని వాటి ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. వారి సంభాషణల మధ్యలో 'ఓ మంత్రి?' అని ఓ పదం దొర్లిందని, ఆయన ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులాగాల్సిందేనని ఢిల్లీ పోలీసులంటున్నారు.