: హాలీవుడ్ సినిమాలను వెనక్కినెట్టిన 'భాగ్ మిల్కా భాగ్'

పరుగుల వీరుడు, 'ఫ్లయింగ్ సిఖ్' మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన'భాగ్ మిల్కా భాగ్' చిత్రం అమెరికాలో హాలీవుడ్ సినిమాలకు దీటుగా ప్రదర్శితమవుతోంది. ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అమెరికాలో ఈవారం అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాల జాబితాలో 15వ స్థానంలో నిలిచింది. రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం అమెరికాలో 140 థియేటర్లలో ప్రదర్శింపబడుతూ, విడుదలైన మూడు రోజుల్లోనే రూ.3.8 కోట్లు వసూలు చేసిందని 'వాషింగ్టన్ పోస్ట్' తన కథనంలో పేర్కొంది.

జులై 12న ఇక్కడ రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటిరోజు కోటి రూపాయలు వసూలు చేయగా, రెండవ రోజుకు రూ.1.6 కోట్లు, మూడవ రోజు (జులై 14) కు రూ.1.1 కోట్లు తెచ్చి పెట్టిందని తెలిపింది. మిల్కా జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ ట్రీట్ మెంట్ తో నిర్మితమైన ఈ చిత్రంలో ప్రతిభావంతుడైన నటుడు ఫర్హాన్ అక్తర్ మిల్కా పాత్రను పోషించగా రికార్డ్ బ్రేక్ చేసిందని 'వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది.

More Telugu News