: తెలంగాణపై స్పీకర్ మనోహర్ అభిప్రాయం ఏమిటి?
తెలంగాణపై అందరి అభిప్రాయాలు దాదాపు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. సీఎం కిరణ్ సమైక్యవాది అని, డిప్యూటీ సీఎం రాజనర్సింహ పక్కా తెలంగాణ వాది అని తెలిసిన విషయమే. ఇక పీసీసీ చీఫ్ బొత్స ప్రత్యేకమైన వ్యక్తి. 'ఎప్పటికెయ్యద ప్రస్తుత మప్పటికా మాటలాడి..' అన్న రీతిలో సందర్భానుగుణంగా ఓసారి తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటంటారు. మరోసారి, అందరం కలిసే ఉందామన్నదే తన అభిప్రాయమంటారు. కానీ, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాత్రం ఇప్పటిదాకా తెలంగాణ అంశంపై తన వాయిస్ ఎక్కడా స్పష్టంగా వినిపించలేదు.
మీడియా కూడా నాదెండ్లకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్టే భావించాలి. ఏదైనా సమాచారం రాబట్టాలంటే గుచ్చిగుచ్చి ప్రశ్నించి, వీలుకాకపోతే అట్నుంచి నరుక్కొచ్చే పాత్రికేయులూ ఈ యువ స్పీకర్ పై పెద్దగా దృష్టి సారించినట్టు కనబడదు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో నేడు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏళ్ళ తరబడి నానుతున్న ఈ ప్రత్యేక సమస్యను పరిష్కరించే క్రమంలో నాదెండ్ల.. డిగ్గీ రాజాకు తన అభిప్రాయం వెల్లడించే ఉంటాడని రాజకీయవర్గాలంటున్నాయి. అయితే, ఆ నిర్ణయం ఏమై ఉంటుందన్నదే ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న!