: మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
బీహార్ లోని సరన్ జిల్లా దహ్రమపాటి గందవాన్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. మంగళవారంనాడు మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్ధులు అది వికటించడంతో పదకొండు మంది మరణించిన సంగతి తెలిసిందే. కాగా, మరో 100 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, ఇవ్వాళ మరో పదిమంది చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అక్కడి బీజేపీ, ఆర్జేడీ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ బందుకు పిలుపునిచ్చాయి. ఈ ఘటనపై అత్యవసరంగా అధికారులతో సమీక్షించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.