: దానివల్లే ఊబకాయం
మనం తినే ఆహారం వల్లే మనకు ఆరోగ్యమైనా... అనారోగ్యమైనా వస్తుంది. మనం ఎంత మోతాదులో తినాలి? అనే విషయాన్ని మన శరీరంలోని హార్మోన్లు నియంత్రిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే మనం మోతాదుకు మించి తినేలా కూడా మరొక హార్మోన్ మనల్ని ప్రోత్సహిస్తుందట. దీనివల్ల మనం మితిమీరి తింటామని, దీని కారణంగా స్థూలకాయం వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మన శరీరంలోని ఒక హార్మోన్ మనం ఎంత తిన్నా కూడా మన ఆకలి తీరకుండా చేస్తుందని, దీనివల్ల మన బరువు పెరగడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో గుర్తించారు. లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఔషధ పరిశోధన మండలి, లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో మన శరీరంలోని ఒక హార్మోన్ మనం ఎంత తిన్నా కూడా మన ఆకలి తీరకుండా చేస్తుందని, దీనిద్వారా మనం అతిగా ఆహారం తీసుకునేలాచేసి మనం బరువు పెరడగానికి కారణమవుతోందని గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు సుమారు 359 మంది స్థూలకాయ బాధితుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సదరు స్థూలకాయుల రక్తంలో 'గ్రెలిన్' అనే హార్మోన్ వారిలో విపరీతమైన ఆకలికి కారణమవుతున్నట్టు వారు గుర్తించారు. దీన్ని అదుపులో ఉంచితే అప్పుడు స్థూలకాయం సమస్యకు ఒక పరిష్కారం కనుగొనవచ్చేమో!