: బోలెడన్ని సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవచ్చు
మన చుట్టూ చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిలో మన కంటికి కనిపించవనివే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా పర్యావరణంలో ఉండే సుమారు 201 రకాల సూక్ష్మజీవుల జన్యుపటాలను శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. దీనిద్వారా ఆయా సూక్ష్మజీవులు పర్యావరణంలో నిర్వహించే పాత్రను గురించి తెలుసుకునే అవకాశం లభించింది.
అమెరికా ఇంధన శాఖ, జాయింట్ జీనోమ్ ఇన్స్టిట్యూట్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పర్యావరణంలో ఉండే 201 రకాల సూక్ష్మజీవుల జన్యుపటాలను ఆవిష్కరించారు. సుమారు తొమ్మిది ప్రాంతాలనుండి ఈ జీవుల కణాలను సేకరించి వాటిపై ప్రయోగాలు చేసి, వాటి శాంపిళ్లను తొమ్మిది వేల కణాలుగా విభజించి తర్వాత వీటిని పునరేకీకరణం చేశారు. తద్వారా 201 రకాల సూక్ష్మజీవుల జన్యుపటాలను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ వల్ల సూక్ష్మజీవులు పర్యావరణంలో ఎలాంటి పాత్రను నిర్వహిస్తున్నాయి, సూక్ష్మజీవుల వంశవృక్షం, పరిణామ క్రమంలో వాటి పాత్ర వంటి విషయాలను గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.