: రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అటు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దాంతో, కోస్తాంధ్ర, తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని... కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. కాబట్టి, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.