: మోడీ సమావేశానికి రూ.5 టికెట్ పై వెంకయ్యనాయుడు వివరణ

వచ్చే నెలలో హైదరాబాదులో జరగనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభకు బీజేపీ ఐదు రూపాయల టికెట్ పెట్టడంపై సీనియర్ నేత వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. యువతను సామాజిక బాధ్యతలో భాగస్వాములను చేసేందుకే ఈ ఐదు రూపాయల విరాళాల సేకరణ చేపట్టినట్టు తెలిపారు. మోడీ ఎదుగుదలను చూసి సహించలేకే కాంగ్రెస్ ఇటువంటి ప్రచారం చేస్తోందని హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మహాత్మాగాంధీ, జయప్రకాశ్ నారాయణ వంటివారే ఉద్యమాలకు విరాళాలు సేకరించారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.

More Telugu News