: అమెరికా శాస్త్రవేత్తల ఘనత... నెఫ్ట్యూన్ కి 14 వ ఉపగ్రహం

సౌరకుటుంబంలో నెఫ్ట్యూన్ గ్రహం చుట్టూ తిరుగుతున్న 14 వ ఉపగ్రహాన్ని కనిపెట్టినట్టు అమెరికా అంతరిక్ష కేంద్రం ప్రకటించింది. 19.3 కిలో మీటర్ల చుట్టుకొలత గలిగిన అతి చిన్న ఉపగ్రహంగా దీన్ని గుర్తించారు. ఉపగ్రహం పేరును ఎస్/2004ఎన్1 గా నామకరణం చేశారు. ఎస్ఈటీఐ ఇనిస్టిట్యూట్ కి చెందిన మార్క్ షోవాల్టర్ నెఫ్ట్యూన్ గ్రహంపై చేసిన పరిశోధనల్లో ఈ ఉపగ్రహాన్ని కనుగొన్నారు. 2004 నుంచి 2009 వరకూ నెఫ్ట్యూన్ గ్రహాన్ని తీసిన 150 ఫొటోల్లో దీని ఉనికి కనిపించినట్టు తెలిపారు. వాటిని ఆధారం చేసుకుని మరింత పరిశోధన చేసి నెఫ్ట్యూన్ కి 14 వ ఉపగ్రహం ఉన్నట్టు నిర్ధారించారు.

More Telugu News