: ఏం జరిగితే అదే జరుగుతుందని దూకేశా.. ప్రాణాలతో బయటపడ్డా!
'హోటల్ శ్లాబ్ ఒక్కసారిగా కదులుతున్నట్టు అనిపించింది. నిద్రలో ఉన్నా... అంతే.. ఒక్కసారిగా లేచి ప్రక్కనున్న పిట్టగోడను పట్టుకుని దూకేశాను. తృటిలో ప్రమాదాన్ని తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాను' ...ఇదీ సిటీలైట్ హోటల్ ప్రమాదం లోంచి బయటపడ్డ ఆ హోటల్ బిర్యానీ సెక్షన్ లో పనిచేసే అస్సాంకు చెందిన రాజేష్ అనే కార్మికుడి గాథ. అయితే అదే హోటల్ లో పనిచేస్తున్న తన తమ్ముడు మొగలి(27)తో పాటు రాజా, వెంకటేష్ లు ఇంకా శిధిలాల క్రిందే చిక్కుకుని ఉన్నట్టు ప్రత్యక్షసాక్షి రాజేష్ చెబుతున్నాడు. శిధిలాలను పూర్తిగా తొలగించే వరకూ మృతులు, క్షతగాత్రుల వివరాలు స్పష్టంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే జయసుధ, కాంగ్రెస్ నేత వీహెచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పురాతన భవనాలను గుర్తించి తొలగిస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవించవని అన్నారు.