: సిటీలైట్ హోటల్ శిధిలాల దగ్గర ప్రతిపక్షాల క్యూ...

ఈ ఉదయం రాష్ట్రపతి రోడ్ లో కుప్పకూలిన సిటీలైట్ హోటల్ భవన శిధిలాల వద్దకు ప్రతిపక్షాలు క్యూకట్టాయి. ఒకరి తరువాత ఒకరుగా బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ నేతలు కూలిన సిటీలైట్ హోటల్ ను సందర్శించి, సహాయక చర్యలను పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సందర్శించి ఇలాంటి ఘటనలకు జీహెచ్ఎంసీ, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అధికారులు స్పందించిన తీరుపై విచారణ జరిపించాలన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందజేయాలని డిమాండ్ చేశారు. చివర్లో సందర్శనకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి జీహెచ్ఎంసీ అధికారుల తీరును విమర్శించారు.

More Telugu News