: 10కి చేరిన మృతుల సంఖ్య.. శిధిలాల కింద మరో 20 మంది
సికింద్రాబాద్ లో సిటీలైట్ హోటల్ బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. శిధిలాల కింద మరో 20 మంది వరకూ ఉన్నట్లు భావిస్తున్నారు. శిధిలాల వెలికితీత వేగంగా కొనసాగుతోంది. ఐదు ప్రొక్లెయినర్లతో శిధిలాలను తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఫైర్ విభాగానికి చెందిన సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. ఘటనా స్థలిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, జిల్లా కలెక్టర్ ఎంకె మీనా, జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు సందర్శించారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ మీనా మీడియాకు తెలిపారు.