: అరుణగ్రహంపై జీవంకోసం ఇస్రో యత్నం

అరుణగ్రహంపై జీవం ఉందా...? ఈ విషయం గురించి ప్రపంచంలోని అగ్రదేశాల్లో చాలా ఉత్సుకత ఉంది. ఈ విషయం గురించి ఇప్పటికే నాసా పలు పరిశోధనలు సాగిస్తోంది. అసలు అరుణ గ్రహంపై వాతావరణం ఎలా ఉంది? వంటి విషయాలను గురించి నాసా ఇప్పటికే కొంత మేరకు సమాచారాన్ని సేకరించింది కూడా. కాగా తాజాగా అరుణగ్రహంపైకి భారత అంతరిక్ష సంస్థ కూడా పరిశోధనకు పూనుకోనుంది.

అంగారక గ్రహంపైన జీవుల ఉనికి అవకాశాన్ని పరిశీలించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో త్వరలో ఒక ఉపగ్రహాన్ని ఆ గ్రహంపైకి పంపనుంది. ఈ ఏడాది అక్టోబరు 21 నుండి నవంబరు 19 మధ్య 'మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌' (ఏంఓఏం) పేరుతో ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగం విజయవంతమయితే అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ పేరు మారుమోగుతుంది. పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌ ద్వారా పంపించబడే ఈ ఉపగ్రహం బరువు సుమారు 15 కేజీలు.

More Telugu News