: తెలంగాణపై త్వరలోనే నిర్ణయం: మల్లు రవి

తెలంగాణపై త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ ప్రతినిధి మల్లు రవి అన్నారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 42 మంది శాసనసభ్యులు 2000 సంవత్సరంలోనే ఓ వినతి పత్రం సమర్పించారని, దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించడం జరిగిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చిందనడంలో వాస్తవం లేదని తెలిపారు. ఇప్పటికే అధిష్ఠానం దీనిపై ఓ నిర్ణయానికి వచ్చేసిందని ఇక ప్రకటనే మిగిలుందని మల్లు రవి అన్నారు.

More Telugu News