: బెజవాడలో వాన బీభత్సం

విజయవాడ నగరాన్ని ఈ సాయంత్రం భారీ వర్షం అతలాకుతలం చేసింది. దీంతో, పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రకాశం బ్యారేజి, కెనాల్ రోడ్డు, లోబ్రిడ్జి, వన్ టౌన్ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, వర్షం ధాటికి కనకదుర్గ ఆలయానికి దారితీసే ఘాట్ రోడ్డుపై బండరాళ్ళు పడ్డాయి. దీంతో, ఆ మార్గంలో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

More Telugu News