: ప్రకాశం జిల్లాలో నిత్య పెళ్ళికొడుకు అరెస్ట్
ప్రకాశం జిల్లాలో ఓ నిత్య పెళ్ళికొడుకు కటకటాల వెనక్కి చేరాడు. కొండేపికి చెందిన వెంకట్రావు అనే ఈ మోసగాడు ఇప్పటివరకు 14 మందిని వివాహం చేసుకున్నాడు. వెంకట్రావును నేడు అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి రూ.11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మారుపేర్లతో అమ్మాయిలను వంచించి పబ్బం గడుపుకోవడం ఇతని నైజం అని పోలీసులు అంటున్నారు. వివాహం చేసుకుని అత్తారింట్లో కొన్నాళ్ళు కాలం గడపడం, అనంతరం అక్కడి నుంచి నగలు, నగదుతో ఉడాయించడం వెంకట్రావుకు వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు తెలిపారు.