: మళ్లీ టీడీపీలోకి చాడ సురేష్ రెడ్డి
వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. అలాగే ఆప్కో మాజీ చైర్మన్ శ్రీరాములు కూడా టీడీపీలోకి రావడానికి మార్గం సుగమం అయింది. ఈ మేరకు వీరితో ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సురేష్ రెడ్డి గతంలో టీడీపీ తరఫున రెండుసార్లు హన్మకొండ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు.