: ఆ చేపకు 200 ఏళ్లు!
ఏదో సరదాకు చేపల వేటకు వెళ్లిన ఒక వ్యక్తికి ఏకంగా ఓ పెద్ద చేప పడింది. అయితే అది ఆషామాషీ చేప కాదు. చాలా పెద్దది... ఆకారంలో సంగతి పక్కన పెడితే, వయసులో మాత్రం అది చాలా పెద్దరికం ఉన్న చేపగా భావిస్తున్నారు. ఎందుకంటే, అది ఏకంగా రెండు వందల ఏళ్ల క్రితం నాటి చేపగా భావిస్తున్నారు.
నీటిలో చాలా లోతులో కొన్ని చేపలు ఏళ్ల తరబడి బతుకుతుంటాయి. అయితే ఎప్పుడో ఒకప్పుడు అవి బయటికి వచ్చి వలలో పడిపోతుంటాయి. కానీ సుమారు రెండు వందల ఏళ్ల నుండి లోతైన నీటిలో బతికేస్తున్న చేపగా భావిస్తున్న ఈ ఆరెంజ్ కలర్ చేప 41 ఇంచిల పొడవుతో, 39.08 పౌండ్ల బరువుతో ఉంది. ఇది సుమారు 900 అడుగుల లోతైన నీటిలో నివసించి ఉంటుందని భావిస్తున్నారు. అలాస్కాలోని సముద్రంలో లభించిన రాక్‌ఫిష్ జాతికి చెందిన ఈ రంగుచేపను షార్ట్‌రాకర్‌గా పిలుస్తారు. కొన్ని చేపలు సుమారు 120 ఏళ్లపాటు బతుకుతాయి. సముద్రంలో 990 నుండి 1,650 అడుగుల లోతైన నీటిలో నివసిస్తూ కొన్ని చేపలు ప్రాణాలు కాపాడుకుంటాయి. అయితే ఇప్పుడు లభించిన చేప వయసు ఎంత ఉంటుంది? అనేది తెలుసుకునేందుకు ఆ చేపకు సంబంధించిన కొన్ని శాంపిల్స్‌ని అలాస్కా ఫిష్ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు.