: వెన్నకలిగిన పాలే పిల్లలకు మంచిది

పిల్లలకు రోజూ పాలు ఇస్తుంటాం. అయితే మనం వారికి ఎక్కువగా వెన్న లేని పాలనే ఇస్తుంటాం. అయితే, పిల్లలకు వెన్న కలిగిన పాలు ఇవ్వడమే చాలా మంచిదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు ఎలాంటి పాలు ఇస్తే పూర్తి పోషకాలు అందుతాయి? అనే విషయంలో బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, కేమ్‌ బ్రిడ్జ్‌లోని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కి చెందిన డాక్టర్‌ డేవిడ్‌ ఎస్‌.లడ్‌విగ్‌, డాక్టర్‌ విల్లెట్‌, ఫ్రెడరిక్‌ జాన్‌స్టేర్‌లు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు.

ఈ అధ్యయనంలో పిల్లలకు రోజూ రెండు కప్పుల పాలు తప్పనిసరిగా ఇవ్వాలని వెల్లడైంది. నిజానికి మనం తక్కువ కొవ్వు ఉంటుందని వెన్న తీసిన పాలను పిల్లలకు ఇస్తుంటాం. అయితే బరువు తగ్గాల్సిన పిల్లలకు మాత్రమే ఇవి ఉపయోగకరంగా ఉంటాయని, మిగిలిన పిల్లలకు వెన్న తీయని పాలు ఇవ్వడమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News