: స్నోడెన్ ను 'హీరో'గా కీర్తిస్తున్న హాలీవుడ్ డైరక్టర్

అమెరికా రహస్యాలను బట్టబయలు చేసిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఐఏ) మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్స్ స్నోడెన్ అభిమానుల జాబితాలో హాలీవుడ్ దర్శకదిగ్గజం అలివర్ స్టోన్ కూడా చేరాడు. స్నోడెన్ ను 'హీరో' అని కీర్తిస్తున్నాడీ నటదర్శకుడు. అతడికి ఆశ్రయం ఇవ్వాలని ప్రపంచదేశాలకు సూచించాడు. అమెరికాను చూసి భయపడాల్సిన పనేమీలేదని ఆయా దేశాలకు ధైర్యం నూరిపోస్తున్నాడు. కాగా, ప్రస్తుతం మాస్కో విమానాశ్రయంలో ఆశ్రయం పొందుతున్న స్నోడెన్ 21 దేశాలకు.. తన రాజకీయ ఆశ్రయం కోసం అభ్యర్థనలు పంపాడు. వీటిలో భారత్ సహా 12 దేశాలు అతడి విజ్ఞప్తిని తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో లాటిన్ అమెరికా దేశాలైన బొలీవియా, వెనిజులా స్నోడెన్ పట్ల సానుకూలంగా స్పందించవచ్చని భావిస్తున్నారు.

More Telugu News