: మ్యాన్ హోల్ లో కారు...

మీరు చదివింది నిజమే! మ్యాన్ హోల్ లో కారు పడిపోయింది. కాకపోతే కారులో ప్రయాణిస్తున్న మహిళకు ఏమీ కాలేదు. మ్యాన్ హోళ్లు మనదేశం లోనే కాదు, అమెరికాలో కూడా తెరిచే ఉంటాయని నిరూపించిన ఘటన అక్కడి ఒహోయా రాష్ట్రం టోలిడో నగరంలో జరిగింది. జోరుగా హుషారుగా... కారు నడుపుకుంటూ వెళ్తున్న ఓ వృద్దురాలు తెరచి ఉన్న మ్యాన్ హోల్ లో కారు సహా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకేమీ జరగలేదు. అగ్ని మాపక సిబ్బంది సహకారంతో పైకి వచ్చింది. టోలిడో నగరాన్ని భారీ వర్షాలు చుట్టుముట్టడంతో, స్థానిక పారిశుద్ధ్య సిబ్బంది మ్యాన్ హోల్ తెరిచి మరమ్మత్తులు చేస్తున్నారు. ఇది గమనించని వృద్దురాలు బ్రేక్ విఫలమవ్వడంతో సరాసరి మ్యాన్ హోల్ లో పడిపోయిందని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News