: వంద నియోజకవర్గాలు.. రెండు వందల రోజులు..
వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ జైలుకు చేరడంతో పార్టీ పగ్గాలు స్వీకరించిన ఆయన సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రం సాగిస్తున్న సంగతి తెలిసిందే. 2012 అక్టోబరు 18న ఇడుపులపాయలో మొదలైన ఆమె ప్రస్థానం నేటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వ్యవధిలో ఆమె 100 నియోజకవర్గాలను చుట్టేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అపూర్వ స్పందన లభించగా, మరికొన్ని చోట్ల ప్రజాదరణ కరవైంది. ప్రస్తుతం షర్మిల విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరుణంలో పార్టీలో పలు చోట్ల లుకలుకలు తలెత్తడం షర్మిలను చికాకు పెడుతున్నాయి. కొన్ని చోట్ల నేతలు పార్టీని వీడుతుండడం అధినాయకత్వానికి మింగుడుపడని విషయమే.