: న్యాయమూర్తులకు ఐఐఎం పాఠాలు
త్వరలో న్యాయాధికారుల కోసం ఐఐఎం పాఠ్యాంశాలను రూపొందించనుంది. తీర్పులలో కచ్చితత్వం, నిర్వహణ పరమైన సామర్థ్యాలను పెంచడంలో వారిని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఐఐఎం సబార్డినేట్ కోర్టుల జడ్డిలకు బ్యాచులవారీగా శిక్షణ ఇస్తుంది. రాష్టాలలోని న్యాయ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఐఐఎంతో కలిసి పాఠ్యాంశాలను రూపొందించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. దీనిపైనే కసరత్తు జరుగుతోందని న్యాయాశాఖ అధికారి ఒకరు తెలిపారు.