: గుంటూరు స్వామి థియేటర్లో బాంబు కలకలం

గుంటూరులో ఈ ఉదయం బాంబు కలకలం చెలరేగింది. ఇక్కడి స్వామి థియేటర్లో బాంబు ఉన్నట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి యాజమాన్యానికి ఫోన్ వచ్చింది. దీంతో, భయాందోళనలకు గురైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన థియేటర్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది.

More Telugu News