: 44 లక్షల ఖరీదైన సర్పంచ్ పదవి

ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో ఒటు హక్కు వినియోగం ద్వారా జరగాల్సిన సర్పంచి పదవి 44 లక్షలకు అమ్ముడు పోయింది. గతంలో సర్పంచి పదవికి ఎవరైనా వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికైతే దాన్ని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం నుంచి వేలంలో ఎక్కువ మొత్తానికి సర్పంచిగా కొనుగోలు చేస్తే అదే గొప్పగా వర్ధిల్లుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలోని గురజాల మండలం గోగులపాడు సర్పంచి పదవిని గ్రామస్థులు వేలం వేశారు. దీనిని 44 లక్షల రూపాయలకు సత్యనారాయణ అనే వ్యక్తి దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News