: 450 కోట్ల హెరిటేజ్ భవంతి పునర్నిర్మాణానికి రెడీ

ముంబైలో ప్రతిష్ఠాత్మకమైన పురాతన క్యాస్ట్ ఐరన్ భవానాన్ని 450 కోట్ల రూపాయలతో పునర్నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబైలోని ఒకప్పటి వాట్సన్స్ హోటల్ భవనమే ఇప్పటి ఎస్ల్పనేడ్ మ్యాన్షన్. దీని వయసు సుమారుగా రెండు వందల ఏళ్లు. దీని ఖరీదు 450 కోట్ల రూపాయల పైమాటే. ఇదొక్కటే ఇప్పటికి మనదేశంలో ఉన్న ఏకైక క్యాస్ట్ ఐరన్ భవన నిర్మాణం. దక్షిణ ముంబైలో ఉన్న ఈ హెరిటేజ్ భవనం శిధిలావస్థలో ఉంది. ఈ భవనం నివాసయోగ్యం కాదంటూ బీఎంసీ నోటీసులు జారీ చేసింది.

బీఎంసీ నోటీసులతో అప్రమత్తమైన భవనంలో నివసిస్తున్న వారు, యజమానులు కలిసి భవన పునర్నిర్మాణానికి సంసిద్ధులౌతున్నారు. అందుకుగాను ప్రభుత్వానికి నోఅబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారు. ప్రస్తుతం భవన యజమాని సాదిక్ అలీ 1980ల్లో ఈ భవనాన్ని టాటాల నుంచి కొనుగోలు చేశారు. మరో వైపు హెరిటేజ్ అధికారులు, వాస్తు శిల్పులు ఈ చారిత్రక భవనం రూపురేఖలు మార్చకుండా అలాగే ఉంచాలని కోరుతున్నారు.

More Telugu News