జగనన్న 'సంపూర్ణ గృహ హక్కు పథకం'ను సద్వినియోగం చేసుకోవాలి: వీఎంసీ కమిషనర్

విజయవాడ: అర్హులందరూ ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగపరచుకొనే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉదేశ్యంతో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం అధికారులతో కలసి సింగ్ నగర్, వాంబే కాలనీ, శాంతి నగర్, న్యూ రాజరాజేశ్వరి పేట తదితర ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు.

పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు సంపూర్ణ ఇంటి హక్కులను కల్పిస్తూ ఓ.టి.ఎస్ విధానము అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సేల్ డీడ్ పూర్తి కాబడి రిజిస్టర్ కాని గృహ యజమానులను గుర్తించి వారికీ కూడా ఈ ఓటీఎస్ వర్తించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. దీని వల్ల లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు వస్తాయని, లబ్ధిదారుడు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ఓ.టి.ఎస్ అమలు చేయుటకు అవకాశం ఉంటుందని తెలిపారు.

హౌసింగ్ కార్పొరేషన్ వద్ద ఋణం తీసుకోని వడ్డీ మీద వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఆ స్థలముపై ఏవిధమైన హక్కులు లేకపోవుట చేత రిజిస్ట్రేషన్ జరుగక అత్యవసర పరిస్థుతులలో అమ్ముకొనుటకు అవకాశం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికీ ఏ విధమైన షరతులు లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం కింద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చన్నారు. 

తద్వారా ఆ స్థలంపై పూర్తి హక్కు వస్తుందని చెప్పారు. దీనిపై ఏమైనా అనుమానాలు ఉన్న యెడల నగరపాలక సంస్థ అధికారులను సంప్రదించవలెనని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, నగరపాలక సంస్థ  సిటీ ప్లానర్ జి.వి.ఎస్.వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More Press News