ఖాళీ అయిన సబ్జెక్టు టీచర్ల పోస్ట్ లను సీనియారీటి ప్రకారం భర్తీ చేయాలి: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

  • ప్యానల్ లిస్టు ఆమోదం తెలిపిన ప్యానల్ కమిటి
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాలలో ఇటీవల కాలములో పదవీ విరమణ ద్వారా ఖాళీ అయిన వివిధ సబ్జెక్టు టీచర్లకు పదోన్నతులు కల్పించు అంశముపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అద్యక్షతన ఆమె ఛాంబర్ నందు ప్యానల్ కమిటి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సబ్జెక్టు టీచర్లను భర్తీ చేయుటకుగాను రోస్టర్ ప్రకారం కేటగిరి మూడులో ఉన్న అర్హత గల సీనియర్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో ప్యానెల్ తయ్యారు చేయటం జరిగింది. ఈ ప్యానెల్ ను నగరపాలక సంస్థలో ప్యానెల్ కమిటీ సభ్యులు పరిశీలించి ఆమోదించటం అయినది.  ఈ ప్యానెల్ పరిశీలనకు మరొక ప్యానెల్ సభ్యులు అయిన జిల్లా విద్యశాఖాధికారి తాహెరాసుల్తానా పాల్గొన్నారు.

ఈ ప్యానెల్ ఆగష్టు 2022వరకు అమలులో ఉంటుంది. ప్యానెల్ ద్వారా ప్రస్తుతం ఆంగ్లం -1, ఫిజిక్స్ -1, నాచురల్ సైన్స్ -2, సోషల్ – 5 మరియు LFL ప్రధానోపాధ్యాయులు -1 పోస్టు లను త్వరలో జరిపే కౌన్సిలింగ్ ద్వారా పదోన్నతులు కల్పించటం జరుగుతుందని వివరించారు.

ప్యానెల్ కమిటీ పరిశీలనలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, నగరపాలకసంస్థ ఉపవిద్యాశాఖాధికారి KVRR రాజు, సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఉమర్ అలీ పాల్గొన్నారు.

More Press News