తెలంగాణ శాసన సభ డైరీ- 2020 ఆవిష్కరణ

తెలంగాణ శాసనసభ డైరీ- 2020, శాసనసభ సభ్యుల బయో డేటా బుక్ లను ఈరోజు అసెంబ్లీ చాంబర్లో ఆవిష్కరించిన శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అంతకు ముందు శాసనసభ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాల (జిమ్) ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాలలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ , చీప్ విప్ లు దాస్యం వినయ్ భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు,అసెంబ్లీ సెక్రటరీ డా.వి. నరసింహా చార్యులు, విప్ కుచుకుంట్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచందర్ రావు, తెర చిన్నపరెడ్డి, బాలసాని లక్ష్మినారాయణ, ఫరూక్ హుస్సేన్, రాజేశ్వర్ రావు, TRSLP ఇంచార్జ్ రమేష్ రెడ్డి మరియు శాసన సభ, శాసనమండలి  సిబ్బంది  పాల్గొన్నారు.


More Press News