లాంఛనంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర

Related image

విజయవాడ
 26-12- 2023

 లాంఛనంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర

 మూడు నియోజకవర్గాలలో ప్రారంభం

 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగా, విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మూడు నియోజకవర్గాలలో లాంఛనంగా తూర్పు నియోజకవర్గంలో బిషప్ గ్రేసీ స్కూల్, గుణదలలో, సెంట్రల్ నియోజకవర్గం లో బసవ పున్నయ్య స్టేడియం లో, పశ్చిమ నియోజకవర్గంలో కాకరపతి భవన్ నారాయణ కాలేజీల లో ఆడుదాం  ఆంధ్ర పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం అని దాని తల్లిదండ్రులు గమనించి పిల్లలను క్రీడల్లో కూడా పాల్గొనేటట్టు ప్రోత్సహించాలని అంతర్జాతీయ మనకు గోల్డ్ మెడలు వస్తున్నాయని. ఆడుదాం ఆంధ్ర ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అయినప్పటికీ మనకు ఈ ఈ పోటీల ద్వారా అంతర్జాతీయ క్రీడాకారులు తయారవ్వాలని  వారు అంతర్జాతీయ క్రీడలు కూడా ఆడి మన పేరు ప్రఖ్యాతలు పెంచాలని అన్నారు

 
 ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమం ఐదు విభాగాల్లో జరుగుతుందని క్రికెట్, బ్యాట్మెంటన్, కోకో, కబ్బాడి, వాలీబాల్ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు అని. ఇవి కాంపిటీటివ్ కేటగిరీ కింద వస్తాయని నాన్ కాంపిటేటివ్ క్యాటగిరి కూడా ఉన్నాయని అందులో యోగా, మెడిటేషన్ లాంటివి ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు 33 వేల రిజిస్ట్రేషన్లు వచ్చాయని ఇవే కాకుండా 4,500 టీమ్స్ ను ఫార్మ్ చేశారని, ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కి అవకాశాలు ఉన్నాయని ఆన్ ద స్పాట్ కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని చెప్పారు. ముందుగా  వార్డ్ లెవెల్ పోటీలు జరుగుతాయని తర్వాత  ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ పరిధిలో పోటీలు జరుగుతాయని తర్వాత మండలం తర్వాత జిల్లాస్థాయి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి లో పోటీలు నిర్వహిస్తున్నారు అని చెప్పారు. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీలో పాల్గొనాలని క్రీడాకారులను ప్రోత్సహించారు అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థ నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా  కల్పిస్తామని అన్నారు.స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ  ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి స్పోర్ట్స్ కిట్స్ కూడా క్రీడాకారులకు అందజేస్తున్నారని. వార్డ్ లెవెల్లో గెలిచిన క్రీడాకారులకు ప్రొఫెషనల్ కిట్స్ తో ప్రోత్సహిస్తున్నట్లు  తెలిపారు. ఆడదాం ఆంధ్ర అనేది టాలెంట్ సెర్చ్ అని ఈ ప్లాట్ఫారం ద్వారా మంచి మంచి క్రీడాకారులను మనం చూడబోతున్నామన్నారు.


సెంట్రల్ నియోజకవర్గంబసవ పున్నయ్య స్టేడియం లోనిర్వహించిన కార్యక్రమం లో ముఖ్య అతిథి అయిన శాసనసభ్యులు  మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ ప్రజల్లో క్రీడాశక్తిని పెంపొందించాలంటే ఇటువంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని తద్వారా ప్రజలు ఆరోగ్యంగానే కాకుండా సంతోషంగా ఉంటారని అన్నారు. రాష్ట్రస్థాయి విజేత కచ్చితంగా మన నియోజకవర్గంలో ఉండాలని క్రీడాకారులను ప్రోత్సహించారు

 సెంట్రల్ యోజకవర్గం ప్రారంభోత్స్తవం  లో పాల్గొన్న  ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు మాట్లాడుతూ అడుదాం ఆంధ్ర మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించే ఒక ప్రతిష్టాత్మక క్రీడా పోటీలని.   దేశంలో ఖేలో ఇండియా పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం అని. క్రీడల పట్ల ఎంతో ఆసక్తి చూపాలని, బ్రాండ్ అంబాసిడర్ అయినా జ్యోతి సురేఖ ఒక మంచి ఉదాహరణే కాదు ఒక స్ఫూర్తి కూడా అని అన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉంటే దేనినైనా సాధించవచ్చు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం జ్యోతి సురేఖ అని అటువంటి క్రీడాకారులను ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎంతోమంది రానున్నారు అని అన్నారు.

 పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అయినా MLA వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పశ్చిమ  నియోజకవర్గం నుండి 5912 మంది యువకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు అని 3957 మంది యువతలు నమోదు చేసుకున్నారు అని తెలిపారు. అందరికి మంచి ఆరోగ్యం కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.అందరికి ఫిటినెస్ తో పాటు క్రీడాలపై మక్కువ పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.నగరంలో అన్ని పార్కులు అభివృద్ధి చేసాం అని తెలిపారు. క్రీడా మైదానం కూడా త్వరలో సిద్ధం కాబోతుందన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఇండోర్ స్టేడియం అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు వాకింగ్ చేసుకునేందుకు పార్కులు అభివృద్ధి చేసాం అన్నారు


ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎన్సిసి విద్యార్థులు మార్చి పాస్టతో గౌరవ అతిథులకు వందనం పలికారు తదుపరి గౌరవ అతిథులు జాతీయ జెండాను మరియు విజయవాడ నగర పాలక సంస్థ జెండాను ఎగరవేశారు తదుపరి క్రీడాజ్యోతి వెలిగించి  లాంఛనంగా ఆడుదాం ఆంధ్రను ప్రారంభించి ఆడుదాం ఆంధ్ర పోటీల్లో క్రీడా స్ఫూర్తితో  ఆడుతామని ప్రతిజ్ఞ చేసి ఆడుదాం ఆంధ్ర మస్కట్ని ప్రదర్శించి క్రీడాకారులకు క్రీడా కిట్లను పంచారు. తదుపరి ఆడుదాం ఆంధ్రాలో నిర్వహిస్తున్న క్రీడలను క్రికెట్, బాడ్మింటన్, ఖో-ఖో వాలీ బాల్, కబ్బడి పోటీలు  ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో ఆడుదాం ఆంధ్ర  బ్రాండ్ అంబాసిడర్ ఇంటర్నేషనల్ ఆర్చరీ ప్లేయర్ జ్యోతి సురేఖ,  నేషనల్ ఫుట్బాల్  ప్లేయర్ మౌనిక పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గం లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, సెంట్రల్ లో  అడిషనల్ కమిషనర్ సత్యవతి, మరియు అన్ని నియోజక వర్గాల స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

     

More Press Releases