ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023 దక్కించుకున్న విజయవాడ నగరపాలక సంస్థ

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023 దక్కించుకున్న విజయవాడ నగరపాలక సంస్థ
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023 దక్కించుకున్న విజయవాడ నగరపాలక సంస్థ

ఇంధనం పొదుపులో విజయవాడ నగరపాలక సంస్థకు స్వర్ణం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (APSECM) ఎనర్జీ డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన  స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు (SECA) 2023 లో ఇంధన సంరక్షణ మరియు  అందుబాటులో ఉన్న శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో విజయవాడ నగరపాలక సంస్థ అద్భుతమైన పనితీరుకు స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు (SECA) 2023 లో ప్రథమ స్థానం (స్వర్ణం) దక్కింది.  

బుధవారం ఉదయం హోటల్ వివాంత, బందర్ రోడ్, విజయవాడ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023 కార్యక్రమం లో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కే సత్యవతి, చీఫ్ సివిల్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి అవార్డు ను ఏపీ జెన్కో మానేజింగ్ డైరెక్టర్  మరియు JMD AP ట్రాన్స్కో KVN చక్రధర్ బాబు ఐఏఎస్ గారి చేతుల మీదుగా అందుకున్నారు.

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023, మొత్తం 3 కేటగిరీలో నిర్వహించారు. మొదటిది ఇండస్ట్రీస్ రెండోది బిల్డింగ్స్ మూడోది ఇన్స్టిట్యూషన్స్ (ULBs). విజయవాడ నగరపాలక సంస్థకు యు.ఎల్.బి  క్యాటగిరిలో( సబ్ క్యాటగిరి 7) స్వర్ణం దక్కించుకుంది.

           
Andhra Pradesh
Energy Conservation Award
Vijayawada

More Press News