వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరించిన రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌

వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరించిన  రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌
హైదరాబాద్, డిసెంబర్ 18 :: ఈరోజు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన TSRTC, రవాణా శాఖకు సంబంధించిన 3 ఫైళ్లపై సంతకం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి బస్‌పాస్‌లకు రాయితీల ఖర్చు రీయింబర్స్‌మెంట్ కోసం 212.50 కోట్లను విడుదల చేస్తూ ఒక ఫైలుపై, 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి గాను 162.50 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మరొక ఫైలుపై, శ్రీమతి L. రాజ్య లక్ష్మి, W/o దివంగత L. పాండు బాబు, హెడ్ ట్రాన్స్‌ పోర్ట్ కానిస్టేబుల్‌కి ఒక లక్ష రూపాయలు మెడికల్ క్లెయిమ్‌ మంజూరు చేస్తు మూడవ ఫైల్ సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వివేక్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, వాణీప్రసాద్‌, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు అభినందించారు.

  
Ponnam Prabhakar
Congress
Telangana

Watch Today's Deals on Amazon

More Press News