మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష.

మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై  మంత్రి  సీతక్క సమీక్ష.
హైదరాబాద్‌లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై  మంత్రి డి.అనసూయ సీతక్క సమీక్ష నిర్వహించారు.  మిషన్ భగీరథ శాఖలోని చీఫ్ ఇంజనీర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్లతో వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రి అదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని గౌరవ మంత్రి శాఖల ఇంజనీర్లను కొరారు. అనంతరం జరిగే మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని మంత్రివర్యులు ఆదేశించారు. త్వరలో మేడారం జాతరపై లైన్ డిపార్ట్‌ మెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రిజర్వాయర్లు, నదుల తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని గౌరవనీయ మంత్రి సూచించారు ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. భగీరథ ప్రాముఖ్యతపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని సీఈలు, ఎస్‌ఈలకు సూచించారు.

3 గంటలపాటు సమగ్రంగా సమీక్ష జరిగింది. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి పూర్తిస్థాయిలో ముఖ్య కార్యదర్శి స్మిత సభర్వాల్ మంత్రికి వివరించారు. సమీక్షా సమావేశంలో మిషన్‌ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కృపాకర్‌ రెడ్డితోపాటు అన్ని మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజనీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Seethakka
Smitha Sabarwal

More Press News